Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:57 AM

ముమ్మరంగా జర్నలిస్టుల సభ్యత్వ నమోదు

ముమ్మరంగా జర్నలిస్టుల సభ్యత్వ నమోదు

ముమ్మరంగా జర్నలిస్టుల సభ్యత్వ నమోదు
13-04-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లాకేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జానయ్య నేతృత్వంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం పలువురు యువ జర్నలిస్టులకు సభ్యత్వ రసీదులు అందజేశారు.ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా నియోజకవర్గాల సమావేశాలు నిర్వహిస్తూ పలు మండలాల అధ్యక్షులను ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.

ఏళ్ల తరబడి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పాటు కనీస వేతనం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై జర్నలిస్టులు తమ హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అక్రిడిటేషన్ కార్డులు, ఆరోగ్య కార్డుల మంజూరులో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తున్న జర్నలిస్టులను నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు.లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చివ్వేంల మండల అధ్యక్షుడు కొంగల సతీష్, కమిటీ సభ్యులు దోసపాటి అజయ్ గౌడ్, నీరుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ముమ్మరంగా జర్నలిస్టుల సభ్యత్వ నమోదు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News