Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:54 AM

ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి

ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి

ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి
January 20, 2026 02:05 PM 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఎస్పీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ పిలుపుతో, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ సూచనలతో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదితర బీఆర్ఎస్ నాయకులు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహను కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌పై ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా అనంతరం మీడియాతో మాట్లాడిన వై. వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్ గౌడ్‌లు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండనీయమన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బీఆర్ఎస్ పార్టీని దిమ్మెలు కూలగొట్టాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా దిగజారడమేనని విమర్శించారు. తెలంగాణలో కనుమరుగైన టీడీపీ, చంద్రబాబుపై ప్రేమ వలకబోసే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిచిన అక్కసుతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేసే చర్యలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేసీఆర్, కేటీఆర్, జగదీశ్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు గౌడ్, ఆకుల లవకుశ, తాహెర్ పాషా, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, అమరవాది శ్రవణ్, బుడిగా నవీన్ తదితరులు పాల్గొన్నారు.






మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News