Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 03:59 AM

MRPS జిల్లా సదస్సును జయప్రదం చేద్దాం

MRPS జిల్లా సదస్సును జయప్రదం చేద్దాం

MRPS జిల్లా సదస్సును జయప్రదం చేద్దాం
January 23, 2026 05:10 PM 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భూషి మహేష్ మాదిగ

స్థానికం:భువనగిరి ఎన్. కుమార్

గత మూడు దశాబ్దాలకుపైగా దళితుల అభివృద్ధి మాదిగల సంక్షేమానికి ఆర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశానుసారం యాదాద్రి భువనగిరి జిల్లా రహదారి బంగ్లాలో జిల్లా అధ్యక్షులు బూసి మహేష్ మాదిగ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరల రమేష్ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరై అనేక సంవత్సరాలుగా అణిచివేతకు గురై సామాజికంగా విలువేయబడిన దళితుల అభివృద్ధి కొరకు ఈ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషనుకు పదివేల కోట్ల రూపాయలు వెంటనే కేటాయించాలని,దానితోపాటు దళితులకు మూడెకరాల భూ పంపిణీ చేయాలని, దళితుల సమగ్ర అభివృద్ధికి అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని వెంటనే ప్రారంభించాలని, యాదాద్రి జిల్లాలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దళిత బంధు పథకంలో పెండింగ్ లో ఉన్న దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని అన్నారు... పై విషయాలపై ఫిబ్రవరి మూడో తారీఖున యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన జిల్లా సదస్సును అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర కార్యదర్శి భైరపాక నాగరాజు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామి బలoల పరశురాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు ఆలేరు నియోజకవర్గం ఇంచార్జ్ బొట్ల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ఇటికాల శ్రీనివాస్ MSF కొంపెల్లి వెంకట్ జిల్లా నాయకులు పల్లెపాటి నరసింహ ఎన్ గోపాల్ భువనగిరి మండల ఇంచార్జ్ ఇటిక్యాల బాలరాజ్ ఆలేరు మండలాధ్యక్షులు సురేష్ కుమార్ యాదగిరిగుట్ట మండలాధ్యక్షులు శ్రీకాంత్ కుమార్ ఎం రామచందర్ నత్తి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News