Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:31 PM

మోత్కూర్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

10-01-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రతి ఓటు కీలకం:తుది ఓటరు జాబితా పక్కాగా ఉండాలి.

జనవరి 12న తుది ఓటరు జాబితా విడుదల అధికారులకు అదనపు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

ఎలాంటి తప్పిదాలు, పొరపాట్లకు ఆస్కారం లేకుండా తుది ఓటరు జాబితాను అత్యంత పక్కాగా రూపొందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మరియు రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులకు ఆదేశించారు. శుక్రవారం మోత్కూర్ మున్సిపల్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ సందర్శించి, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికలను సమర్థవంతంగా,పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఒక్కో వార్డు వారీగా ఓటరు జాబితాను క్షుణ్ణంగా రూపొందించాలని, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రదర్శించాలని తెలిపారు. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, వాటిని సకాలంలో పరిష్కరించి, జనవరి 12వ తేదీన తుది ఓటరు జాబితాను విడుదల చేయాలని ఆదేశించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకమని పేర్కొంటూ,అర్హత గల ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా పర్యవేక్షించడంతో పాటు, ఒకే కుటుంబానికి చెందిన అర్హులైన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అదే సమయంలో బోగస్ ఓటర్లకు ఏమాత్రం అవకాశం లేకుండా క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన చేపట్టాలని ఆదేశించారు. ఓటరు జాబితా తయారీలో ఎలాంటి తప్పిదాలు జరిగితే సంబంధిత బూత్ లెవల్ అధికారులు,సూపర్వైజర్లు మరియు ఇతర సిబ్బందిని బాధ్యులుగా పరిగణిస్తామని హెచ్చరించారు.తుది ఓటరు జాబితా విడుదలకు ముందు సవరించిన డ్రాఫ్ట్‌ను ర్యాండమ్‌గా తనిఖీ చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అందరూ పూర్తి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్,మేనేజర్,వార్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మోత్కూర్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News