కాకతీయుల కాలం నాటి పిల్లలమర్రి శివాలయాల్లో భక్తుల రద్దీ
మూల నక్షత్రం ఏకాదశి శుక్రవారం సందర్భంగా చారిత్రాత్మకమైన 12వ శతాబ్దపు కాకతీయుల కాలంనాటి పిల్లలమర్రి శివాలయాలు లో పూజలు వైభవంగా నిర్వహించబడ్డాయి.ఉదయం వేళ శ్రీ సరస్వతి అమ్మవారు వారికి విశేష అభిషేకం నిర్వహించారు.
అనంతరం నూతన వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక ఆరాధనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. తదుపరి శ్రీ చక్ర దేవత కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు సమూహంగా కుంకుమ పూజ నిర్వహించి అమ్మవారిని ప్రార్థించారు. పూజల అనంతరం నీరాజన మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కాకతీయుల శిల్పకళకు ప్రతీకగా నిలిచిన ఈ ఆలయాల్లో ప్రతి పర్వదినాన భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ వైభవం, చారిత్రక ప్రాధాన్యత భక్తులను ఆకర్షిస్తోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి