Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:39 AM

మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: రైతుల డిమాండ్

26-03-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండలంలో మొక్కజొన్న, వరి పంటలు కోతకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్వో, ఏఓలకు వినతిపత్రం సమర్పించారు.

మండలంలో సుమారు 6,000 ఎకరాల్లో మొక్కజొన్న, 22,000 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు రైతులు తెలిపారు. వారం రోజుల్లో రెండు పంటలు హార్వెస్టర్‌కు రానున్నాయని, అకాల వర్షాల వల్ల నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.

గోనెసంచులు, హమాలీలు, లారీలు, కొనుగోలు మిల్లులను ముందుగానే సిద్ధం చేసి కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ప్రైవేట్ వ్యాపారుల బారిన పడకుండా ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని కోరారు.

మొక్కజొన్నకు క్వింటాకు రూ.2,400, వరికి రూ.2,500 ధర చెల్లిస్తూ ఎలాంటి పరిమితులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల పంట తడవకుండా టార్పాలిన్లు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు మల్లెల సమ్మతరావు, రైతు సంఘం మండల కార్యదర్శి గంగాధర్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తోటకూరలు వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు గురుమూర్తిగారు పాల్గొన్నారు

Sthanikam

మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: రైతుల డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News