Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:56 AM

మోదిన్‌పురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

12-04-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రైతులకు పూర్తి మద్దతు – సన్నరకం ధాన్యానికి అదనపు బోనస్

చివ్వెంల మండలంలోని మోదిన్‌పురం గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్రాలలో తేమ కొలిచే యంత్రాలు, శుభ్రపరిచే యంత్రాలు, తూకం పరికరాలు, కవర్లు, గన్నె సంచులు కొరత లేకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

సన్నరకం ధాన్యానికి అదనంగా ప్రతి క్వింటాలుకు ఐదు వందల రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. గ్రేడ్ ఏ ధాన్యానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు, సాధారణ రకం ధాన్యానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయల మద్దతు ధర లభిస్తుందని చెప్పారు.రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి తేమశాతం తగ్గించి కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దళారులకు విక్రయించకుండా ప్రభుత్వ అనుమతి ఉన్న కేంద్రాలలోనే అమ్మాలని రైతులను కోరారు.

కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అధికారుల వద్ద ఉన్న వరి కోతల వివరాల ఆధారంగా ధాన్యాన్ని దశల వారీగా కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాగరపు సునీత ప్రసాద్, ఉప సర్పంచ్ కాకి శేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ సభ్యుడు అబ్దుల్ కరీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఛత్రు నాయక్, ఏలుగూరి వీరయ్య, పందిరి మల్లేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు కోడిదల వెంకన్న, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మోదిన్‌పురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News