Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం

03-02-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి చిట్యాల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం ముఖ్య అతిథిగా హాజరై క్రీడా జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, యువత, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండటానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. సీఎం కప్ క్రీడల్లో ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించి చిట్యాల మండలాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి గౌతమ్ రెడ్డి, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డ్ సభ్యులు కురు యాదయ్య, నీలకంఠ లింగస్వామి, సాగర్ల నాగరాజు పాల్గొన్నారు. అలాగే వివిధ పాఠశాలల నుంచి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై క్రీడా పోటీలను ఉత్సాహంగా తిలకించారు.

Sthanikam

మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News