Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:05 AM

మంత్రి పార్థసారథి సహకారంతో చాట్రాయి మండలానికి వేగవంతమైన అభివృద్ధి: మోరంపూడి శ్రీనివాసరావు

మంత్రి పార్థసారథి సహకారంతో చాట్రాయి మండలానికి వేగవంతమైన అభివృద్ధి: మోరంపూడి శ్రీనివాసరావు

మంత్రి పార్థసారథి సహకారంతో చాట్రాయి మండలానికి వేగవంతమైన అభివృద్ధి: మోరంపూడి శ్రీనివాసరావు
March 14, 2026 03:57 PM 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చనుబండలో రూ.80 లక్షల సిమెంట్ రోడ్ పనులకు శ్రీకారం –

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి సారథ్యంలో నూజివీడు నియోజకవర్గం, ముఖ్యంగా చాట్రాయి మండలం వేగంగా అభివృద్ధి చెందుతోందని చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు తెలిపారు. మంత్రి పార్థసారథి మంజూరు చేసిన ఈ సిమెంట్ రోడ్ నిర్మాణ పనులను మోరంపూడి శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి సారథి సహకారంతో మరో ఏడాదిలో చనుబండ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రావెల్ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లుగా మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరు చేసిన మంత్రి పార్థసారథికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభివృద్ధి పనులతో గ్రామంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ సహాయకురాలు దివ్య, గవర వెంకటేశ్వరరావు, శెట్టి నాగరాజు, దేశిన చెన్నారావు, గజవెల్లి వెంకటేశ్వరరావు, భారత వెంకటేశ్వరరావు, చిల్లపల్లి చెన్నారావు, వీరయ్య, బొట్టు దుర్గారావు, కందుల రమేష్, కందుల చెన్నారావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News