Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్టేట్ ర్యాంక్ సాధించిన సోమపంగు శర్మని వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 10:28 PM

మంగలి తండాలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మంగలి తండాలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మంగలి తండాలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
April 12, 2026 08:48 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రైతులకు గిట్టుబాటు ధర లక్ష్యం – మధ్యవర్తులపై ఆధారపడొద్దని సూచన

ఆత్మకూర్(ఎస్) మండలంలోని మంగలి తండా గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను విక్రయిస్తే నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయని అన్నారు.

కందగట్ల, మంగలి తండా పరిసర గ్రామాల రైతులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. సమయానికి ధాన్యం కొనుగోలు జరిగేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రపరచి తీసుకురావాలని సూచించారు.వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల సంక్షేమం కోసం ఇలాంటి కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంగలి తండా సర్పంచ్ లునవత్ కృష్ణ, కందగట్ల సర్పంచ్ శిగ నాగమణి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ సభ్యురాలు గోగుల పద్మ సత్తిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు భూతం లింగయ్య, వార్డు సభ్యులు, సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యండి అంజాద్ అలి, ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడు చింతమళ్ల రమేష్, జిల్లా కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అబ్దుల్ రహీం, మున్సిపల్ సభ్యులు కొండపల్లి దిలీప్ రెడ్డి, కొనతం రాజేష్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్ నాయుడు, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నారాయణ ప్రవీణ్ రెడ్డి, బొల్లం కృష్ణయ్య, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News