Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:38 AM

మంగళగిరిలో అభివృద్ధి పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన, ప్రారంభోత్సవం

09-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

గుంటూరు జిల్లా మంగళగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.

నులకపేటలో శ్రీరంగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.65 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ హాల్ స్థానిక ప్రజలకు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని తెలిపారు.

అనంతరం పెదవడ్లపూడిలో రూ.14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన హై లెవల్ కెనాల్ ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతంలోని రైతులకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

పెనుమూలి గ్రామంలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రంథాలయాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకు, జ్ఞాన వికాసానికి గ్రంథాలయాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

మంగళగిరిలో అభివృద్ధి పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన, ప్రారంభోత్సవం

Article Image

గుంటూరు జిల్లా మంగళగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.

నులకపేటలో శ్రీరంగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.65 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ హాల్ స్థానిక ప్రజలకు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని తెలిపారు.

అనంతరం పెదవడ్లపూడిలో రూ.14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన హై లెవల్ కెనాల్ ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతంలోని రైతులకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

పెనుమూలి గ్రామంలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రంథాలయాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకు, జ్ఞాన వికాసానికి గ్రంథాలయాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News