Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:39 AM

మీడియా మిత్రుల సంఘీభావం… వంద పడకల ఆస్పత్రి కోసం మూడవరోజుకు చేరిన దీక్షలు.

18-03-2026 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వంద పడకల ఆస్పత్రి హామీ వచ్చేదాకా దీక్ష విరమణ లేదు

సీపీఐ(ఎం) నేత జల్లెల పెంటయ్య హెచ్చరిక

మీడియా మిత్రుల సంఘీభావం

రామన్నపేట: రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు నిరవధిక నిరాహార దీక్షలను విరమించేది లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణాలు పణంగా పెట్టినా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ఆస్పత్రి స్థాయి పెంపు, నూతన భవన నిర్మాణం కోసం సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతోందని ఆయన తెలిపారు.

మూడో రోజు దీక్ష సందర్భంగా మండల పాత్రికేయులు స్వచ్ఛందంగా దీక్షా శిబిరానికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ స్పందన లేకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. నాయకుల ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు ఏటల్లి శ్రీనివాస్, బూరుగు వెంకటేశం, కొండ మల్లేశం గౌడ్, కేవి సుధాకర్ రాజు, లవణం ఉపేందర్, జినుకుల శ్రీనివాస్, కైరం కొండ సంతోష్, మాండ్ర సత్యనారాయణ , బొడ్డు పరశురాం తదితరులు పాల్గొన్నారు

Sthanikam

మీడియా మిత్రుల సంఘీభావం… వంద పడకల ఆస్పత్రి కోసం మూడవరోజుకు చేరిన దీక్షలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News