Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తా

మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తా

మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తా
25-02-2026 265 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

10 వ వార్డు కౌన్సిలర్ దేప రమ్య రాజుకు ఘన సన్మానం

చౌటుప్పల్ పట్టణంలోని శ్రీరామ కూరగాయల మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పురపాలక పదో వార్డు కౌన్సిలర్ దేప రమ్య రాజు ని ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పదో వార్డు నుంచి విజయం సాధించిన సందర్భంగా మార్కెట్ ప్రాంగణంలో సత్కార కార్యక్రమాన్నినిర్వహించారు. పూలదండలు, శాలువాతో కౌన్సిలర్‌ను సత్కరించిన కమిటీ సభ్యులు ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన దేప రమ్య రాజు, “శ్రీరామ కూరగాయల మార్కెట్ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తాను. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాను. మౌలిక వసతుల మెరుగుదల, శుభ్రత, పారిశుధ్యం, డ్రైనేజీ, పార్కింగ్ వంటి అంశాలపై దశలవారీగా చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు. మార్కెట్ కమిటీ అధ్యక్షులు దేప రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పిల్లలమర్రి జగదీష్, బొబ్బిళ్ళ కాళేశ్వర్, ప్రధాన కార్యదర్శి బాబు, కార్యదర్శి యాట రాజు, కోశాధికారి రషీద్, సాంస్కృతిక కార్యదర్శి పాశం వెంకటేశం, ప్రచార కార్యదర్శి కొడాలి దిలీప్, గౌరవ అధ్యక్షులు పిల్లలమర్రి యాదగిరి, గుండ్ల శంకరయ్య, నిమ్మల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News