Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:37 AM

మానవతా సేవా సారథి అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు నీలం శేఖర్

20-03-2026 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,: మండలంలోని ఎన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు నీలం శేఖర్ ఉగాది విశిష్ట సేవ పురస్కారాలలో భాగంగా మానవతా సేవా సారథి అవార్డును అందుకున్నారు. ఉపాధ్యాయుల్లో సామాజిక సేవకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించడం విశేషం.

హైదరాబాద్ కళావేదిక ప్రాంగణంలో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, గంగోత్రి కల్చరల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రవీణ్, పారిజాత చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఈ అవార్డులు అందజేశారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే నీలం శేఖర్ అనేక సామాజిక సంస్థలతో అనుసంధానమై సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులకు ప్రేరణ కార్యక్రమాలు, ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సహాయం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మద్దతుగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ నాయకులు, సినీ గాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. తమ మండలానికి చెందిన ఉపాధ్యాయుడు ఈ అవార్డు అందుకోవడం పట్ల ఎంఇఓ గవ్వ జ్యోతి, దొడ్డి స్వామి, శేఖర్, సురేందర్ రెడ్డి, బాసరాజు యాదగిరి, మట్టా రెడ్డి, తీగల జాన్ రెడ్డి, కమలాదేవి, భవాని, సీనా రెడ్డి, మణి, సైదులు, రవి కుమార్ స్వామి, మధుబాబు తదితరులు అభినందనలు తెలిపారు.

Sthanikam

మానవతా సేవా సారథి అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు నీలం శేఖర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News