Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

మల్కాజిగిరి పోలీసులు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సు

30-01-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా మల్కాజ్గిరి పోలీసులు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మౌలాలి ప్రాంతంలో ఉన్న రోటో మేకర్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ట్రాఫిక్ విభాగానికి చెందిన ఎస్‌.ఐ. శ్రీనివాస్, ఎస్‌.ఐ. ఉపేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు రోడ్డు భద్రతకు సంబంధించిన కీలక అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.రోడ్డు పై వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని వారు వివరించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వాడకం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలపై స్పష్టంగా అవగాహన కల్పించారు.ట్రాఫిక్ నియమాలను అతిక్రమించడం వల్ల జరిగే ప్రమాదాలు కేవలం వ్యక్తిగత నష్టానికే కాకుండా, ఒక కుటుంబం మొత్తం జీవితాన్ని అస్తవ్యస్తం చేసే పరిస్థితులకు దారి తీస్తాయని హెచ్చరించారు. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల ప్రాణ నష్టం సంభవిస్తే దాని ప్రభావం కుటుంబ సభ్యులపై ఎప్పటికీ ఉండిపోతుందని తెలిపారు.ప్రతి పౌరుడు రోడ్డు భద్రతను రోజువారీ బాధ్యతగా భావించి, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ను నిత్యం పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, అలాగే ప్రమాదాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.ఈ అవగాహన సదస్సు ద్వారా ఉద్యోగుల్లో రోడ్డు భద్రతపై అవగాహన మరింత పెరిగిందని, భవిష్యత్తులో ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తామని ఉద్యోగులు తెలిపారు. ఈ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలనివారణకుదోహదపడుతుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

మల్కాజిగిరి పోలీసులు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News