Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:37 AM

మల్కాజ్‌గిరి ఆస్తి సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గళం

26-03-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మల్కాజ్‌గిరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ఆస్తి సమస్యలను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శాసనసభలో ప్రస్తావించారు.

నియోజకవర్గంలో సుమారు 384 ఎకరాల పరిధిలో ఉన్న 76 కాలనీలను వక్ఫ్ బోర్డు ఆస్తులుగా ప్రకటించి, 22-A కింద నిషేధిత జాబితాలో చేర్చడంతో సుమారు 18 వేల ఇళ్ల యజమానులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

దీంతో బ్యాంకు రుణాలు పొందడం, ఇళ్లు అమ్మడం, మార్టిగేజ్ చేయడం, అదనపు అంతస్తులు నిర్మించడం వంటి కార్యకలాపాలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం లేక ప్రజలు కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోందని, అనుమతుల కోసం భారీ ఖర్చులు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ భూములు నిజంగా వక్ఫ్ బోర్డు పరిధిలోకే వస్తాయా లేదా అన్నది ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆస్తి లావాదేవీలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ అంశంపై స్పందించిన మంత్రివర్గం సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

Sthanikam

మల్కాజ్‌గిరి ఆస్తి సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గళం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News