Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:35 AM

మల్గి గ్రామంలో పరిశ్రమకు గ్రామస్తుల గట్టి నిరసన

03-01-2026 128 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలం మల్గి గ్రామంలో శనివారం నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఉద్రిక్తంగా సాగింది.గ్రామంలో కంపెనీ ఏర్పాటు చేయరాదని కోరుతూ గ్రామస్తులు ఏకగ్రీవంగా నిరసన వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటుతో పర్యావరణ కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యం, భూగర్భ జలాలు, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ నాయకులకు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐఎన్‌హెచ్‌ఆర్‌పీసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్ధు మాట్లాడుతూ, ప్రజల సమ్మతి లేకుండా కంపెనీలు ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవన హక్కుల రక్షణే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని, మల్గి గ్రామ ప్రజల న్యాయమైన డిమాండ్‌కు పూర్తిస్థాయిలో మద్దతుగా నిలుస్తామని తెలిపారు.రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ డిగ్గే బాబు మాట్లాడుతూ, గ్రామస్తుల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించాలని, ప్రజల ఆరోగ్యం కంటే పరిశ్రమలు ముఖ్యమనే ఆలోచన సరికాదన్నారు. అవసరమైతే ఉన్నతాధికారులు, ప్రభుత్వ విభాగాల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓంప్రకాష్ మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, గ్రామస్తుల విజ్ఞప్తిని సంబంధిత అధికారులకు అందజేసి కంపెనీ ప్రతిపాదనను రద్దు చేసే దిశగా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐఎన్‌హెచ్‌ఆర్‌పీసీ రాష్ట్ర, జిల్లా నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కంపెనీ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామంలో పరిశ్రమ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని గ్రామస్తులు స్పష్టంగా ప్రకటించారు.

Sthanikam

మల్గి గ్రామంలో పరిశ్రమకు గ్రామస్తుల గట్టి నిరసన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News