Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:49 AM

మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

17-04-2026 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రమావత్ మధును అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరిట భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

పోలీసుల సమాచారం ప్రకారం, మధు మరియు అతని బృందం దాదాపు రూ.150 కోట్ల వరకు ప్రజల నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో పలు కేసులు నమోదు అయ్యాయి.

ఈ చీటింగ్ వ్యవహారంలో పాపులర్ గాయని తో పాటు ఆమె సోదరుడి పేర్లు కూడా వెలుగులోకి రావడం మరింత సంచలనంగా మారింది. అడ్వకేట్ సుబ్బారావు తదితరులు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు మరింత చర్చనీయాంశమైంది.

కేసు బయటపడిన వెంటనే రమావత్ మధు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి, తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మధు అరెస్టుతో ఈ కేసులో ఉన్న అసలు నిజాలు బయటపడే అవకాశముందని, మోసానికి గురైన బాధితులకు న్యాయం జరిగే దిశగా విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Sthanikam

మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News