Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:35 AM

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ఉద్యమాలకు సిద్ధం కావాలి

12-03-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ పిలుపు

మహిళల సమస్యల పరిష్కారం కోసం,వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ మహిళలకు అండగా ఉంటూ ముందుండి పోరాడుతుంది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) అని,మహిళల సమస్యల పరిష్కారానికి మహిళలందరూ ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ పిలుపునిచ్చారు.శుక్రవారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డి గ్రామంలో ఐద్వా గ్రామ మహాసభ కొండ హైమావతి అధ్యక్షతన జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనురాధ పాల్గొని మాట్లాడుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 1981 సంవత్సరంలో మహిళా సాధికారత, సామాజిక సమానత్వం కోసం,హింసకు వ్యతిరేకంగా ఏర్పడి మహిళల హక్కుల పైన పోరాడి అనేక విజయాలు సాధించిందని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం కోసం, విద్య కూడా మహిళలకు అందించాలని, బాల్య వివాహాలు నిషేధించాలని,పురుషులతో పాటు స్త్రీలకు ఆస్తి హక్కు ఉండాలని, వరకట్నం వేధింపుల నిరోధక చట్టం ఉండాలని,గృహహింస నిరోధక చట్టం ఉండాలని, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉండాలని, మహిళా కమిషన్లు ఏర్పాటు చేయాలని పోరాడి ఐద్వా విజయం సాధించింది అన్నారు. మహిళల సమస్యలే సంఘం సమస్యలుగా భావించి వారి తరఫున నిరంతరం పోరాడుతున్నది ఐద్వా సంఘమని తెలిపారు. బిజెపి పాలనలో రోజురోజుకు మహిళల మీద దాడులు,దౌర్జన్యాలు,హత్యలు,అత్యాచారాలు కొనసాగుతున్నాయని వీటికి వ్యతిరేకంగా మహిళలందరూ పోరాటాలకు,ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు. ఐద్వా మండల కార్యదర్శి కొండమడుగు నాగమణి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వము రోజురోజుకు ప్రజల పైన భారాలు మోపుతూ నిత్యవసర వస్తువుల ధరలను పెంచుతూ పోవడం వల్ల పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఈ మధ్యకాలంలో గ్యాస్ ధర పెద్ద ఎత్తున పెంచడం చాలా దారుణమని అన్నారు.ధరలు పెరగడం వల్ల ప్రధానంగా మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా పెంచిన గ్యాస్ ధర,నిత్యవసర వస్తువుల ధరను తగ్గించాలని వారు డిమాండ్ చేసినారు. అనంతరం 16 మందితో నూతన ఐద్వా గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా ఎడ్ల జ్యోతి,కార్యదర్శిగా కొండ హైమావతి,కోశాధికారిగా కొండమడుగు కావ్య,ఉపాధ్యక్షురాలుగా కొండమడుగు లక్ష్మీ,పిన్నింటి హేమలత, సహాయ కార్యదర్శులుగా మెరుగు మహేశ్వరి,బొల్లెపల్లి భాను కమిటీ సభ్యులుగా ఎడ్ల రామలీల,కొండ సుజాత,ఆకారం తులసమ్మ,కొండమడుగు మమత,కొండ మంగమ్మ,బొజ్జ లక్ష్మి,బబ్బురి ఉపేంద్ర,మెరుగు సుశీల, బొజ్జ అలివేలు ఎన్నికైనారు.

Sthanikam

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ఉద్యమాలకు సిద్ధం కావాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News