Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:11 AM

మహిళలు, బాలికలకు భరోసాగా నిలుస్తున్న భరోసా సేవలు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

07-05-2026 139 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రంలో భరోసా 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్., అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఐపీఎస్. పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిర్భయ ఘటన అనంతరం వర్మ కమిటీ సిఫార్సుల మేరకు పోక్సో, అత్యాచార కేసుల బాధిత మహిళలు, బాలికలకు ఒకే వేదికపై మెడికల్, లీగల్, కౌన్సిలింగ్, పరిహారం వంటి సేవలు అందించేందుకు 2016లో భరోసా కేంద్రాన్ని ప్రారంభించారని తెలిపారు. గత పదేళ్లుగా భరోసా కేంద్రం బాధితులకు ఫిర్యాదు నమోదు నుంచి కోర్టు తీర్పు వచ్చే వరకు అండగా నిలుస్తూ సేవలు అందిస్తోందన్నారు. శిక్షణ పొందిన భరోసా సిబ్బంది బాధితుల్లో ధైర్యం నింపుతూ సత్వర న్యాయం అందేలా పనిచేస్తున్నారని కొనియాడారు.అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ పోక్సో, అత్యాచార కేసుల బాధితులు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, సమాచారం అందిన వెంటనే భరోసా సిబ్బంది అన్ని సేవలు అందిస్తారని తెలిపారు. మహిళలపై నేరాల నియంత్రణ కోసం పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రం ఇప్పటివరకు 688 పోక్సో కేసులు, 85 అత్యాచార కేసులు, 162 కిడ్నాప్ కేసులు కలిపి మొత్తం 935 కేసుల్లో సేవలు అందించింది. అలాగే 175 అవగాహన కార్యక్రమాలు, 249 హోమ్ విజిట్స్, 531 వైద్య పరీక్షలు నిర్వహించగా, 468 మంది బాధితులకు రూ.1.83 కోట్లకు పైగా పరిహారం అందజేసింది. కార్యక్రమంలో డీఎస్పీ సత్యయ్య గౌడ్, టౌన్ ఇన్స్పెక్టర్ రాము నాయుడు, ఎస్ఐ పూలబాయ్, భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళలు, బాలికలకు భరోసాగా నిలుస్తున్న భరోసా సేవలు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News