Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:08 AM

మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించాలి నలగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

27-03-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలకు సత్కారం

నల్గొండ పట్టణ కేంద్రంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో వాసవి క్లబ్ కెసిజిఎఫ్ నల్గొండ, వాసవి క్లబ్ స్ఫూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తమకు నచ్చిన రంగంలో విజయాన్ని సాధించేందుకు పురుషులు తగిన ప్రోత్సాహం, సహకారం అందించాలని సూచించారు. నేటి సమాజంలో మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణిస్తూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు.

కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్లు, ఆశా వర్కర్లు, హోంగార్డ్స్, షీ టీమ్స్, డాక్టర్లు, లాయర్లు తదితర రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను శాలువాలతో సత్కరించి మేమెంటోలు అందజేశారు. వారి సేవలను ప్రశంసిస్తూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అపారమని పేర్కొన్నారు.

మహిళలకు సహనం, ఓర్పు అధికమని, కుటుంబ బాధ్యతలతో పాటు సామాజిక బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారని అన్నారు. ప్రతి పురుషుడి విజయానికి మహిళే ప్రధాన కారణమని, మహిళలను గౌరవిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 104 ఏ డిస్ట్రిక్ట్ గవర్నర్ వీరేల్లి సతీష్ కుమార్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ కార్పొరేటర్ యామా కవితా దయాకర్, మహిళా కార్పొరేటర్లు, వాసవి క్లబ్ స్ఫూర్తి అధ్యక్షురాలు మిట్టపల్లి సంతోషి, కార్యదర్శి మురారి శెట్టి నందిని, కోశాధికారి తాడిచెట్టి విజయ, వాసవి క్లబ్ కెసిజిఎఫ్ నల్గొండ అధ్యక్షుడు మిట్టపల్లి వాత్సవ్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మి, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ రాగమాలిక, డాక్టర్ సంతోషి తదితరులు హాజరయ్యారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించాలి నలగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News