Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:56 PM

మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ ధ్యేయం: నిర్మల జగ్గారెడ్డి

02-05-2026 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం సంగారెడ్డి పీఎస్ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని విమర్శిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకే ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు రూ.195.18 కోట్ల విలువైన బ్యాంకు రుణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో జ్యోతి, ఆర్డీఓ రాజేందర్, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ చైర్‌పర్సన్లు కూన వనిత, అంజమ్మ, మున్సిపల్ కౌన్సిలర్లు, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, శివాజీతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ ధ్యేయం: నిర్మల జగ్గారెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News