Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:58 PM

మహిళల భద్రతే లక్ష్యం – బోరంచలో షీ టీమ్ చైతన్య కార్యక్రమం

30-04-2026 182 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధి బోరంచ గ్రామంలోని శ్రీ నల్లపోచమ్మ దేవస్థానం ఆవరణలో మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్ ఎస్ఐ పూలభాయ్ మాట్లాడుతూ మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ షీ టీమ్ బృందాలు నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు. పితృస్వామ్య వ్యవస్థ, లింగ వివక్ష, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, బాలల రక్షణ చట్టాలు, మహిళల హక్కులు వంటి అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు సైబర్ మోసాలు, ఫేక్ అకౌంట్లు, సోషల్ మీడియా దుర్వినియోగం, ఆన్‌లైన్ వేధింపులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులను సంప్రదించాలని, అత్యవసర పరిస్థితుల్లో 100, 112, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సంగారెడ్డి షీ టీమ్ నంబర్ 8712656772ను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానూర్ పోలీస్ అధికారులు, షీ టీమ్ సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు, దేవస్థానం కమిటీ సభ్యులు, అర్చకులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళల భద్రతే లక్ష్యం – బోరంచలో షీ టీమ్ చైతన్య కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News