Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:50 AM

మహిళా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: కొప్పుల వేణారెడ్డి

02-06-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని 11వ వార్డు రాయన్‌గూడెంలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదల చిరకాల గృహ స్వప్నం నెరవేరుతోందని తెలిపారు. ఇందిరమ్మ చీరల పంపిణీ ద్వారా మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతి మహిళ ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలు, పేదల సంక్షేమమే లక్ష్యంగా సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి మహిళ అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ ఏలుగూరి ఇందిరా–వీరయ్యగౌడ్, మాజీ ఎంపీటీసీలు ఏలుగూరి వెంకటేశం, మేకరబోయిన శేఖర్, మాజీ సర్పంచ్ ముత్యాల సైదులు, మాజీ మూసి వైస్ చైర్మన్ కొప్పుల రాంరెడ్డి, చిత్తలూరు కృష్ణ, నంద్యాల బిక్షం రెడ్డి, నంద్యాల శ్రీనివాస్ రెడ్డి, జంగిలి సైదులు, తంగెళ్ల రజనీకాంత్ రెడ్డి, ఎడ్ల ఉపేందర్, నంద్యాల వెంకటరెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, నల్లమేకల సైదులు, షేక్ సొందు, దేవేందర్ రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ ఏలుగూరి వినోద్, ఉపాధ్యాయుడు యాకయ్య, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బైరు నాగరాజు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: కొప్పుల వేణారెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News