Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:33 AM

మహిళా రైతుల సదస్సు జయప్రదం చేయాలి: జూలకంటి రంగారెడ్డి

23-03-2026 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

మార్చి 31న రామన్నపేటలో నిర్వహించనున్న మహిళా రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.

స్థానిక సీపీఎం మండల కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మహిళా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ పోరాటానికి కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.

వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు కొత్త చట్టాల ద్వారా ఇబ్బందులు కలిగిస్తున్నారని విమర్శించారు.

మహిళా రైతులకు భూమిపై హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని, జాయింట్ పట్టాలు ఇవ్వాలని కోరారు. పెట్టుబడి సాయం అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మహిళా రైతుల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయాలని సూచించారు.

వ్యవసాయ అనుబంధ రంగాల్లో మహిళల పాత్ర పెరుగుతోందని, వారికి ప్రోత్సాహకాలు అందించాలని తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఈ సదస్సు వేదిక అవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల అధ్యక్షుడు గన్నేబోయిన విజయభాస్కర్, బల్గూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా రైతుల సదస్సు జయప్రదం చేయాలి: జూలకంటి రంగారెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News