Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:38 AM

మహిళా రైతు రాష్ట్ర సదస్సుకు ముమ్మర ఏర్పాట్లు.మేక అశోక్ రెడ్డి

26-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మార్చి 31న రామన్నపేటలో జరగనున్న తెలంగాణ రైతు సంఘం మహిళా రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. సదస్సు ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో గోడ రాతల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 250 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరుకానున్నారని తెలిపారు. మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నట్లు చెప్పారు. మండల రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై తీర్మానాలు చేయడంతో పాటు మహిళా రైతుల హక్కుల కోసం చైతన్యం కల్పించి ఉద్యమాలను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సదస్సుకు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర నాయకులు తీగల సాగర్, పోతినేని సుదర్శన్ తదితరులు హాజరవుతారని తెలిపారు.

యూరియా యాప్ వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ధర్మారెడ్డి పల్లి కాల్వను త్వరగా పూర్తి చేసి రైతులకు నీరందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు గన్నేబోయిన విజయభాస్కర్, బోయని ఆనంద్, నాయకులు కందుల హనుమంతు,గొరిగే సోములు,బావండ్లపల్లి బాలరాజు, పల్లె సత్యం,బావండ్లపల్లి సత్యం, కుందూరు వెంకటేష్, తరిగొప్పుల వెంకటరెడ్డి, మార్త భూపాల్ రెడ్డి, ఆమనగంటి మహేష్, గంటెపాక బిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా రైతు రాష్ట్ర సదస్సుకు ముమ్మర ఏర్పాట్లు.మేక అశోక్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News