Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:48 PM

మహాత్మా గాంధీ పేరును సంక్షేమ పథకాల నుండి తొలగిస్తే, ప్రజల హృదయాలనుండి తొలగించలేరు.

మహాత్మా గాంధీ పేరును సంక్షేమ పథకాల నుండి తొలగిస్తే, ప్రజల హృదయాలనుండి తొలగించలేరు.

మహాత్మా గాంధీ పేరును సంక్షేమ పథకాల నుండి తొలగిస్తే, ప్రజల హృదయాలనుండి తొలగించలేరు.
December 28, 2025 04:36 PM 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

స్థానికం ప్రతినిధి బిక్షం


భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నాటి యుపిఏ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరుని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తొలగిస్తుందేమో తప్ప, దేశ ప్రజల హృదయాలనుండి మాత్రం తొలగించలేదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ వేడుకల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు గల కాంగ్రెస్ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపుమేరకు పట్టణంలోని గాంధీ స్మారక విగ్రహం ముందు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు నిరసనగా నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలోనే అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఎంతగానో దోహద పడిందని గుర్తు చేశారు. దేశంలో గాంధీ పేరును ప్రజల నుండి దూరం చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఈ సందర్భంగా తప్పి కొట్టారు. దేశంలో కులం, మతం పేరుతో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం దేశ స్వాతంత్రం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని ప్రజలలో అభాష్పాలు చేసేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ప్రపంచ దేశాలలోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు గాంధీ కుటుంబం చేసిన కృషి, త్యాగం ఈ దేశ ప్రజల హృదయాలలో నిరంతరం ఉంటుందని అన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరిస్తున్నారని అక్కస్సుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తూ, స్వయం ప్రతిపత్తి గల సంస్థలను తన అదుపులో పెట్టుకొని నిరూపణ లేని ఆరోపణలతో ఇబ్బందులకు గురిచేస్తూ, దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పుతూ, భవిష్యత్తు తరాలకు ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ రంగ సంస్థలు లేకుండా చేస్తున్నారని వివరించారు. దేశంలోని అనేక రాజ్యాంగబద్ధ సంస్థలలో సంఘపరివారశక్తులను నింపి, దేశ అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్న వ్యక్తులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మతం ముసుగు తగిలించుకున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి, రానున్న ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పేందుకు పార్టీ శ్రేణులు కంకణ బత్తులై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు ఈరసారపు యాదగిరి గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, జిల్లా ఎంపీటీసీల ఫోరం తాజా మాజీ ఉపాధ్యక్షులు ఆరే ప్రశాంత్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండ్రాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షులు ఎంఏ ఏజాజ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నేతలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మహాత్మా గాంధీ స్మారక విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News