Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:50 PM

మహిళా విద్యకు మార్గదర్శకురాలు సావిత్రి బాయి పూలెకు ఘన నివాళులు

మహిళా విద్యకు మార్గదర్శకురాలు సావిత్రి బాయి పూలెకు ఘన నివాళులు

మహిళా విద్యకు మార్గదర్శకురాలు సావిత్రి బాయి పూలెకు ఘన నివాళులు
January 03, 2026 02:25 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సామాజిక సమానత్వానికి ఆమె సేవలు చిరస్మరణీయం : వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

ఆత్మకూరు / సూర్యాపేట :

సావిత్రి బాయి పూలె జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ గారు మహానీయురాలైన సావిత్రి బాయి పూలె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ, భారతదేశంలో మహిళా విద్యకు బాటలు వేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలె అని తెలిపారు. సామాజిక వివక్ష, లింగ అసమానతలకు ఎదురొడ్డి విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని ఆమె నిరూపించారని అన్నారు. ఆడపిల్లల విద్య కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.

వెనుకబడిన వర్గాలు, మహిళలు, దళితుల అభ్యున్నతికి సావిత్రి బాయి పూలె చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడి బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం సావిత్రి బాయి పూలె ఆశయాలకు అనుగుణంగా నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ఆత్మకూరు మండల పార్టీ అధ్యక్షుడు బొల్లె సైదులు, యువజన విభాగం అధ్యక్షుడు కోల కరుణాకర్ ముదిరాజ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏశబోయిన మల్లేష్, బొమ్మగాని సైదులు, పగిళ్ల శరత్, లింగాల సైదులు, సేవ్యా నాయక్, కొన్నె మంజుల, నారాయణదాసు, కవిత, కడియం వంశీ, మహేష్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సావిత్రి బాయి పూలెకు ఘన నివాళులు అర్పించారు.

సావిత్రి బాయి పూలె జయంతి సందర్భంగా విద్య, సమానత్వం, సామాజిక చైతన్యం కోసం మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News