Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:52 PM

మాఘ తొలి సోమవారం శివనామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణాలు

19-01-2026 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బ్రహ్మసూత్రం ఉన్న రెండు శివాలయాల్లో తెల్లవారుజామునే రుద్రాభిషేకాలు

పంచామృతాలతో అభిషేకం… విశేష అలంకరణలో ఈశ్వరుడి దివ్య దర్శనం

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

మాఘ మాసం తొలి సోమవారం మహా పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మసూత్రం ఉన్న రెండు శివాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామునే ఆలయాలు తెరచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పంచామృతాలతో శివలింగానికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణతో మహాదేవునికి ప్రత్యేక పూజలు చేశారు. పూలు, దీపాలతో శివాలయాలు భక్తిశ్రద్ధలతో నిండిపోయాయి. రుద్రాభిషేకం అనంతరం విశేష అలంకరణలో ఈశ్వరుడి దివ్య దర్శనం భక్తులను అలరించింది. భక్తులు ఉపవాస దీక్షలు చేసి, వ్రతాలు ఆచరిస్తూ శివ నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దర్శనాలు కొనసాగించారు. భక్తులు కుటుంబ సమేతంగా హాజరై శివుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Sthanikam

మాఘ తొలి సోమవారం శివనామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణాలు

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News