Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:47 AM

మాదిగలకు 11% ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలి

17-04-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

లేకపోతే ప్రజాస్వామ్య పోరాటం తప్పదు: యాతాకుల రాజన్న మాదిగ

తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ప్రాతిపదికన 11 శాతం ఎస్సీ రిజర్వేషన్ల వాటాను వెంటనే ప్రకటించి అమలు చేయాలని మహాజన సోషలిస్ట్ పార్టీ (ఎంఎస్పీ) జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ డిమాండ్ చేశారు.

శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్, జమ్మిగడ్డలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఏపూరి రాజు మాదిగ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన కులగణన ప్రకారం మాదిగల జనాభా సుమారు 10.3 శాతంగా ఉందని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసే క్రమంలో మాదిగల జనాభా ప్రకారం కనీసం 11 శాతం వాటా రావాలని డిమాండ్ చేశారు.

గతంలో ఈ అంశంపై సామాజిక ఉద్యమకారుడు కూడా స్పష్టంగా డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే కొంతమంది స్వార్థపరుల ప్రభావంతో మాదిగల వాటాను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

మాదిగల హక్కులను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో తీవ్ర ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. అవసరమైతే ప్రభుత్వం పై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ని ఉద్దేశించి మాట్లాడుతూ, మాదిగల న్యాయమైన వాటాను తగ్గించే ప్రయత్నాలు చేస్తే గద్దె దించడానికైనా వెనుకాడమని హెచ్చరికలు జారీ చేశారు.

ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, బొజ్జ సైదులు మాదిగ, ములకలపల్లి రవి మాదిగ, కొత్తపల్లి అంజయ్య, పాతకోట్ల నాగరాజు, లంజపల్లి శ్రీను, కొండపల్లి సూర్యప్రకాశ్, ఆకారపు కొండలు, పందింటి నవీన్ కుమార్, మండి కత్తి గోపీచంద్ మాదిగ, చందుపట్ల జనార్ధన్ మాదిగ, రాజేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

మాదిగల హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

Sthanikam

మాదిగలకు 11% ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News