Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:06 AM

మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి జైలు శిక్ష

26-02-2026 152 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మరొ ఇద్దరికి జరిమానా

ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు కఠిన తనిఖీలు – ట్రాఫిక్ ఎస్సై సాయిరాం

సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడిన నలుగురిని గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఇందులో ఇద్దరికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించగా, మరో ఇద్దరికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఎస్సై సాయిరాం తెలిపారు. ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి గోపు రజిత తీర్పు ప్రకారం ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష, మరొకరికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున జరిమానా విధించారు. మరో ఇద్దరికి కలిపి మూడు వేల రూపాయల జరిమానా విధించినట్లు ఎస్సై వెల్లడించారు.

జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా మాత్రమే కాకుండా జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరించారు. పోలీసులు నిర్వహించే వాహన తనిఖీలు ప్రజల ప్రాణ రక్షణ కోసమేనని, అందరూ చట్టాలను గౌరవించి పోలీసులకు సహకరించాలని ఎస్సై సాయిరాం కోరారు.

Sthanikam

మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి జైలు శిక్ష

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News