Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:24 PM

మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న దాబా నిర్వాహకుడు అరెస్టు

మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న దాబా నిర్వాహకుడు అరెస్టు

మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న దాబా నిర్వాహకుడు అరెస్టు
January 10, 2026 09:49 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

ఈగల్ టీం తో చాకచక్యంగా పట్టుకున్న చిట్యాల పోలీసులు

9 కిలోల ఓపియం, స్వాధీనం

చిట్యాల పట్టణ శివారులో ఉన్న ఒక దాబాలో ఓపియం మారకద్రవ్యాలు విక్రయిస్తున్న ధాబా నిర్వాహకున్ని చిట్యాల పోలీసులు ఈగల్ టీం సహాయంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా నల్గొండ డిఎస్పి కే శివరాం రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ శివారులో జాతీయ రహదారి 65 పై ఉన్న డూన్ పంజాబీ దాబా లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ కు చెందిన దాబా యజమాని గుర్మీత్ సింగ్ గత కొంతకాలంగా నిషేధిత మాదకద్రవ్యమైన ఓపియం పాపి హస్క్ ఉందని దానిని దాబాలోని కస్టమర్లకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడని వచ్చిన సమాచారం తో చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ సిబ్బందితో కలిసి దాబాకు వెళ్లి యజమాని గుర్మీత్ సింగ్ నిషేధిత ఓపియం పాపి హస్క్ ను వాహనదారులకు విక్రయిస్తుండగా పట్టుకున్నారు అని అనంతరం ఎస్సై మామిడి రవికుమార్ దాబా యజమానిని విచారించగా సులభంగా డబ్బు సంపాదించేందుకు గాను జాతీయ రహదారిపై వెళుతున్న లారీ డ్రైవర్ల నుండి తాను ఓపియం పాపి హస్కును ఒక్క కిలో 1800 రూపాయలకు కొనుగోలు చేసి దానిని తిరిగి కిలో 6000 రూపాయలకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. కొద్దిరోజుల క్రితం 10 కిలోల ఓపియం పాపి హస్క్ కొనుగోలు చేసి అందులో సుమారు ఒక కిలో కస్టమర్లకు విక్రయించి మిగిలిన 9 కిలోల ఓపియం పాపి హస్కును డాబా లోని తన గదిలో దాచి పెట్టినట్లు తెలిపారు. దాబా యజమాని నుండి 54000 రూపాయల నగదు, 9 కిలోల ఓపియం పాపి హస్క్, ఒక స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నల్గొండ డిఎస్పి కే శివరాంరెడ్డి పర్యవేక్షణలో నార్కెట్పల్లి సీఐ కే నాగరాజు ఆధ్వర్యంలో ఎస్సై ఎం రవికుమార్ మరియు స్టేషన్ సిబ్బంది లు చేసిన పనికి డిఎస్పి వారిని అభినందించారు..


* మారకద్రవ్యాలపై ఉక్కు పాదం : డి.ఎస్.పి శివరాం రెడ్డి


అక్రమ మాలికద్రవ్యాల ను సరఫరా చేసిన అమ్మిన వారి పైన వినియోగించిన వారిపై వదిలిపెట్టబోమని మారకద్రవ్యాలపై పోలీసు వ్యవస్థ ఉక్కు పాదంతో అంచివేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు .గంజాయి సరఫరా అమ్మే వ్యక్తులపైనే కాకుండా సేవించే వ్యక్తుల పైన కూడా చట్టపరమైన శిక్షలు తీసుకుంటామన్నారు. మాదక ద్రవ్యాల ఎవరైనా విక్రయించిన సేవించిన 100 నెంబర్ కు గాని లేదా 8712670266 నెంబర్కు గాని సమాచారం అందించినట్లయితే వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు..

ఈ సమావేశంలో నార్కెట్పల్లి సీఐ కే నాగరాజు, చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్, మునుగోడు ఎస్సై ఇరిగి రవి సిబ్బంది పాల్గొన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News