సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యపేట జిల్లా మద్దిరాల మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తహసిల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మచ్చుకోరి రాజేష్ వయస్సు ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్న అనంతరం నిత్యవసర సరుకుల కోసం బయటకు వెళ్లిన సమయంలో కుంటపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి