Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:20 PM

మార్గమధ్యంలో దివ్యాంగుడికి అండగా నిలిచిన ఎంపీ సురేష్ షెట్కార్

05-01-2026 496 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:జహీరాబాద్ నుంచి ఖేడ్‌కు వెళ్తున్న సందర్భంగా ఎంపీ సురేష్ కూమార్ షెట్కార్ మానవత్వాన్ని చాటుకున్నారు. మార్గమధ్యంలో బాదల్గాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు దత్తు చెయ్యెత్తి ఆపడంతో ఆయన తన కాన్వాయ్‌ను వెంటనే నిలిపారు. కారు దిగి దత్తును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పలకరించి, అతని ఆరోగ్యం, జీవన పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి సవివరంగా తెలుసుకున్నారు.దత్తు తన సమస్యను వివరించగా,ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. దివ్యాంగుల పట్ల ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఎంపీ స్పందన, ఆప్యాయతకు దత్తు భావోద్వేగానికి లోనై ఆనందం వ్యక్తం చేశాడు. ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా సామాన్యుల కష్టాలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ముందుకు రావడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

Sthanikam

మార్గమధ్యంలో దివ్యాంగుడికి అండగా నిలిచిన ఎంపీ సురేష్ షెట్కార్

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:జహీరాబాద్ నుంచి ఖేడ్‌కు వెళ్తున్న సందర్భంగా ఎంపీ సురేష్ కూమార్ షెట్కార్ మానవత్వాన్ని చాటుకున్నారు. మార్గమధ్యంలో బాదల్గాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు దత్తు చెయ్యెత్తి ఆపడంతో ఆయన తన కాన్వాయ్‌ను వెంటనే నిలిపారు. కారు దిగి దత్తును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పలకరించి, అతని ఆరోగ్యం, జీవన పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి సవివరంగా తెలుసుకున్నారు.దత్తు తన సమస్యను వివరించగా,ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. దివ్యాంగుల పట్ల ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఎంపీ స్పందన, ఆప్యాయతకు దత్తు భావోద్వేగానికి లోనై ఆనందం వ్యక్తం చేశాడు. ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా సామాన్యుల కష్టాలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ముందుకు రావడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News