Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతే లక్ష్యం.. నరసింహపురం అభివృద్ధికి సర్పంచ్ వేమూరి సత్యనారాయణ వినూత్న అడుగు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 05:25 AM

మా ప్రాణాలైనా ఇస్తాం కానీ.. సాగు భూములను వదులుకోం - ఐటి పార్క్, డేటా సెంటర్ భూసేకరణపై భోగాపురం మండలం ముంజేరు రైతుల.

30-01-2026 126 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

భోగాపురం/విజయనగరం: ప్యాకేజీలు వద్దు.. మా భూములే మాకు ముద్దు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు రైతులు విన్నపం.

విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో ప్రభుత్వం ప్రతిపాదించిన ఐటి పార్క్ మరియు డేటా సెంటర్ నిర్మాణాల కోసం సాగు భూములను సేకరించాలనే నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు విజయనగరం జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్, వైయస్సార్ సిపి జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుని ధర్మపురి, తన క్యాంప్ కార్యాలయం నందు కలిసిన ముంజేరు గ్రామ రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటూ వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా రైతులు తమ వాదనను ఈ విధంగా వినిపించారు:వ్యవసాయమే మా జీవనాధారం వందల సంవత్సరాలుగా వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నామని, మా భూముల్లో ఏడాదికి మూడు, నాలుగు పంటలు పండుతాయని రైతులు తెలిపారు. వరి, చెరుకు, వేరుశనగ, కొబ్బరి, సరుగుడు వంటి పంటలతో దేశవ్యాప్తంగా ఎగుమతులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామని పేర్కొన్నారు.

గతంలోనే త్యాగం చేశాం:ఇప్పటికే అభివృద్ధి కోసం ప్రభుత్వం అడిగిన వెంటనే భోగాపురం విమానాశ్రయం కోసం సుమారు 3 వేల ఎకరాల భూమిని ఇచ్చామని, ఇప్పుడు మిగిలి ఉన్న కొద్దిపాటి సారవంతమైన భూములను కూడా లాక్కోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్యాకేజీలు వద్దు - భూమే ముద్దు: ఎన్ని కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చినా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంత ఆశ చూపినా తాము భూములను విక్రయించలేదని, తమకు వ్యవసాయం తప్ప మరే పని తెలియదని రైతులు స్పష్టం చేశారు.

ఉపాధి ఎక్కడ?: గతంలో భూములు సేకరించిన ప్రాంతాల్లో ఇప్పటికీ ఎటువంటి నిర్మాణాలు జరగలేదని, స్థానిక రైతులకు ఎటువంటి ఉపాధి కల్పించలేదని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.

ప్రభుత్వానికి హెచ్చరిక:

"మా ప్రాణాలు తీసి అయినా సరే భూసేకరణ చేసుకోవాలి తప్ప, మేము భూములను ఇచ్చే ప్రసక్తే లేదు" అని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ముంజేరు గ్రామ భూసేకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, ఐటి పార్క్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి,సర్పంచు పూడి నూకరాజు, పిడుగు సత్యనారాయణ, పిడుగు వెంకట సత్యం, ఎంపీటీసీ వెంకట సత్యం, పిడుగు తోట రావు, జక్కంపూడి రాంబాబు, పిడుగు తౌడు ఇతర గ్రామ రైతులు, పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

మా ప్రాణాలైనా ఇస్తాం కానీ.. సాగు భూములను వదులుకోం - ఐటి పార్క్, డేటా సెంటర్ భూసేకరణపై భోగాపురం మండలం ముంజేరు రైతుల.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News