Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:26 PM

లోక్ అదాలత్‌తో వివాదాలకు శాశ్వత పరిష్కారం – ప్రజలకు ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపు

08-06-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపునిచ్చారు. క్షణికావేశంలో జరిగిన సంఘటనలు, చిన్నచిన్న వివాదాల కారణంగా నమోదైన కేసులను పరస్పర అవగాహనతో రాజీ ద్వారా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని ఆయన తెలిపారు. జిల్లాలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాలు అంగీకారంతో రాజీ కుదుర్చుకోవడం ద్వారా సమయం, ధనం, శ్రమ ఆదా కావడంతో పాటు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ మరియు వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ తదితర కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి పోలీసు అధికారులు, సిబ్బంది రాజీ పడదగిన కేసుల్లో కక్షిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వివాదాలకు ముగింపు పలికి సామరస్యపూర్వక వాతావరణాన్ని నెలకొల్పాలని జిల్లా ఎస్పీ కోరారు.

Sthanikam

లోక్ అదాలత్‌తో వివాదాలకు శాశ్వత పరిష్కారం – ప్రజలకు ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News