Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:41 AM

లోక్ అదాలత్‌తో కేసుల పరిష్కారం సులువు: ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్

28-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రంగారెడ్డి,

కేసుల త్వరిత పరిష్కారానికి లోక్ అదాలత్ ఉత్తమ మార్గమని రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీ కర్ణ కుమార్ తెలిపారు.

రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సివిల్ కేసుల్లో చెల్లించిన కోర్టు ఫీజులు తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆస్తి, కుటుంబ వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. లోక్ అదాలత్‌లో రాజీ కుదిరితే ఇరు పక్షాలూ గెలిచినట్లేనని అన్నారు.

జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. అనూష మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 22 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద బీమా, వినియోగదారుల కోర్టు, ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. లోక్ అదాలత్ నిర్వహణలో పోలీసు, ఇన్సూరెన్స్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్యానెల్ అడ్వొకేట్లు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది సహకరించారని చెప్పారు. కక్షిదారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉచిత భోజనం కూడా ఏర్పాటు చేశారు.

ఈ జాతీయ లోక్ అదాలత్‌లో సుమారు 1.20 లక్షల పైచిలుకు కేసులు పరిష్కరించగా, రూ.8,32,49,040 వరకు నష్టపరిహారం కక్షిదారులకు అందజేశారు.

Sthanikam

లోక్ అదాలత్‌తో కేసుల పరిష్కారం సులువు: ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News