Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

లింగయ్యత్ ధర్మ స్థాపన దినోత్సవం సందర్భంగా ఖేడ్ బసవ కూడలిలో జెండా ఆవిష్కరణ

Updated : 16 Jan 2026 12:41 IST
As Preferred Source 1 min read
లింగయ్యత్ ధర్మ స్థాపన దినోత్సవం సందర్భంగా ఖేడ్ బసవ కూడలిలో జెండా ఆవిష్కరణ

జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గం, నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని ఖేడ్ బసవ కూడలిలో లింగయ్యత్ ధర్మ స్థాపన దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర లింగయ్యత్ సంఘ గౌరవ అధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మా బసవేశ్వరులు పన్నెండవ శతాబ్దానికి చెందిన గొప్ప సామాజిక సంస్కర్త, తత్వవేత్త, కవి మరియు లింగయ్యత్ ధర్మ స్థాపకులలో అగ్రగణ్యులని అన్నారు. కుల వివక్ష, మూఢాచారాలు, అంధ విశ్వాసాలను తీవ్రంగా వ్యతిరేకించి, సమాజంలో సమానత్వం, మానవ గౌరవం, న్యాయం నెలకొల్పేందుకు ఆయన జీవితాంతం కృషి చేశారని కొనియాడారు.‘కాయకవే కైలాస’ అనే మహత్తర సిద్ధాంతంతో శ్రమకు దైవసమానమైన గౌరవాన్ని కల్పించిన మహానీయుడు బసవేశ్వరులని తెలిపారు. క్రీ.శ. 1131 సంవత్సరంలో కర్ణాటక ప్రాంతంలోని బసవన బాగేవాడిలో జన్మించిన ఆయన, ప్రజాసేవనే పరమావధిగా భావించి మంత్రిగా, తత్వవేత్తగా సామాజిక సంస్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించారని వివరించారు.ప్రతి వ్యక్తి తనలోని శివభక్తిని ప్రతిబింబించేలా ఇష్టలింగం ధరించాలని బోధించిన మహాత్మా బసవేశ్వరులు, అనుభవ మంటపం ద్వారా పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ సామాజిక, ఆధ్యాత్మిక చర్చలకు వేదిక ఏర్పాటు చేశారని అన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించి, అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడిన మహోన్నత సంస్కరణవాది బసవేశ్వరులని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో లింగయ్యత్ సంఘ నాయకులు, భక్తులు, మహిళలు, యువతతో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

లింగయ్యత్ ధర్మ స్థాపన దినోత్సవం సందర్భంగా ఖేడ్ బసవ కూడలిలో జెండా ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి