Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:01 PM

లారీని ఢీకొట్టిన ఎర్టిగా కార్: సూర్యాపేట యువకుడు దుర్మరణం!

27-05-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కోయలగూడెం బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదం

సిగ్నల్స్ లేకుండా రోడ్డుపై ఆపిన డీసీఎం లారీనే కాలయముడు

జాతీయ రహదారి 65పై బుధవారం సాయంత్రం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...సూర్యాపేట జిల్లా, చివ్వేంల మండలం, బధ్య తండాకు చెందిన లంబాడి సామాజిక వర్గానికి చెందిన బానోతు మల్లేష్ (35) (తండ్రి: రెడ్యా) వృత్తిరీత్యా డ్రైవర్. బుధవారం తన ఎర్టిగా కారు (TG 26T 1119) లో కిరాయి ప్యాసింజర్లను హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో డ్రాప్ చేశాడు. అనంతరం తిరిగి సూర్యాపేట వైపు ప్రయాణమయ్యాడు.​మార్గమధ్యలో చౌటుప్పల్ పరిధిలోని కోయలగూడెం బ్రిడ్జి వద్దకు రాగానే, అప్పటికే రోడ్డుపై రిపేరు వచ్చి ఆగి ఉన్న ఒక డీసీఎం లారీని (AP 24 TG 1529) మల్లేష్ నడుపుతున్న ఎర్టిగా కారు వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎం లారీ డ్రైవర్ వాహనానికి సంబంధించి ఎటువంటి ప్రమాద హెచ్చరిక సిగ్నల్స్ (ఇండికేటర్స్ లేదా రిఫ్లెక్టర్స్) పెట్టకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల సమయంలో వెలుతురు తగ్గుతున్న క్రమంలో, ఆగి ఉన్న లారీని గమనించలేకపోవడంతో కారు వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జవ్వగా, మల్లేష్ తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.​ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే చౌటుప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని కారులో నుండి బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.​ఈ ఘటనపై చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ మాట్లాడుతూ.. ప్రమాదానికి కారణమైన డీసీఎం లారీపై కేసు నమోదు చేశామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

Sthanikam

లారీని ఢీకొట్టిన ఎర్టిగా కార్: సూర్యాపేట యువకుడు దుర్మరణం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News