Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:18 PM

లారీలు ఏర్పాటు చేసి వారం రోజుల్లో కొనుగోలు పూర్తి చేయాలని జేసీకి రైతు సంఘం వినతి.

27-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని, వెంటనే వేగవంతం చేసి వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల సమీక్ష కోసం రామన్నపేటకు వచ్చిన రెవెన్యూ జాయింట్ కలెక్టర్ వెంకట్‌రెడ్డికి రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ మండలంలో సుమారు మూడు లక్షల క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉందన్నారు. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో రైతులు దున్నకాలు చేపడుతున్నప్పటికీ, రెండు నెలలుగా కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తాలు, తరుగు పేరుతో రైస్‌మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఐకేపీ కేంద్రానికి ఐదు లారీలు అందుబాటులో ఉంచి ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని కోరారు.

ఈదురుగాలులతో వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడిసి మొలకెత్తే ప్రమాదం ఉందని, వెంటనే అధికారులు స్పందించకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యుడు బల్గూరి అంజయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి గన్నేబోయిన విజయభాస్కర్, వ్యకాస మండల అధ్యక్షుడు మేడి ముకుంద, నాగటి లక్ష్మణ్, మార్త భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లారీలు ఏర్పాటు చేసి వారం రోజుల్లో కొనుగోలు పూర్తి చేయాలని జేసీకి రైతు సంఘం వినతి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News