Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:08 PM

లక్ష్య సాధనకు విద్యార్థులు కష్టపడాలి : ఎస్పీ పరితోష్ పంకజ్

22-05-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పోలీసు కుటుంబాలకు చెందిన పిల్లలు విద్యలో, పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో “స్పార్క్” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డితో కలిసి ఖాకీ కిడ్స్‌కు భవిష్యత్తులో ఉన్న అవకాశాలు, విద్య ప్రాముఖ్యత, లక్ష్య సాధన, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై పలు సూచనలు చేశారు. చిన్నప్పటి నుంచే స్పష్టమైన లక్ష్యంతో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదివితే విజయాన్ని సులభంగా సాధించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను మంచికి వినియోగించుకొని పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని, గత సంవత్సరాల మోడల్ పేపర్లు పరిశీలించడం, ప్రతిరోజూ న్యూస్ పేపర్ చదివే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.ఖాకీ కిడ్స్‌కు మరింత ప్రోత్సాహం అందించేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక స్టడీ హాల్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలీసు సిబ్బంది తమ విధులతో పాటు కుటుంబ సభ్యుల భవిష్యత్తుపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పిల్లల విద్యాభివృద్ధికి అండగా నిలవాలని సూచించారు. అర్హత కలిగిన సిబ్బంది కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో సత్తా చాటాలని ప్రోత్సహించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే “స్పార్క్” కార్యక్రమాన్ని ఖాకీ కిడ్స్ సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పోలీసు సిబ్బంది, ఖాకీ కిడ్స్ మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

లక్ష్య సాధనకు విద్యార్థులు కష్టపడాలి : ఎస్పీ పరితోష్ పంకజ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News