Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:48 AM

లైసెన్స్ లేని టిప్పర్ డ్రైవర్లతో ప్రాణసంకటం

23-04-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణంలో శాంతినగర్, విజయకాలనీ, హనుమాన్‌నగర్ ప్రాంతాల్లో టిప్పర్ల రాకపోకలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైసెన్స్ లేని డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శాంతినగర్ సర్వీస్ రోడ్, జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయం రోడ్డుమీదుగా రోజుకు 30–40 ట్రిప్పులు టిప్పర్లు తిరుగుతున్నాయి. వీటి వల్ల రోడ్డు పక్కన ఉన్న ఇళ్లు, దుకాణాలు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు దుమ్ముతో కలుషితమవుతున్నాయి.

ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, టిప్పర్ డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడుపుతూ వాహనదారులను భయాందోళనలకు గురిచేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు టిప్పర్‌కు చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి బాధితులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

గురువారం శాంతినగర్ అండర్‌పాస్ సమీపంలో జరిగిన ఘటనలో, నిర్లక్ష్యంగా నడిపిన టిప్పర్ బైక్‌ను ఢీకొట్టే పరిస్థితి ఏర్పడింది. స్థానికులు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని తెలిపారు. అనంతరం టిప్పర్‌కు చెందిన వారు డ్రైవర్‌ను తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.

ఈ మార్గంలో టిప్పర్ల రాకపోకలను నియంత్రించాలని, ప్రత్యామ్నాయంగా ట్రాక్టర్ల ద్వారా మట్టి, ఇసుక రవాణా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Sthanikam

లైసెన్స్ లేని టిప్పర్ డ్రైవర్లతో ప్రాణసంకటం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News