Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:37 AM

కూరెళ్ల విఠలాచార్య సాహిత్యంపై సమాలోచన రామన్నపేట కళాశాలలో పుస్తక సమీక్ష

24-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన “డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య సాహిత్యం–సమాలోచనం” పుస్తక సమీక్షా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గొప్ప సాహితీవేత్తగా నిలిచారని అన్నారు. తన ఇంటినే గ్రంథాలయంగా మార్చి సమాజానికి విశేష సేవలందిస్తున్నారని కొనియాడారు. మహాకవి దాశరథి పురస్కారంతో పాటు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. అటువంటి మహనీయుడి సాహిత్యంపై జాతీయ సదస్సు నిర్వహించి, పుస్తకంగా తీసుకురావడం అభినందనీయమన్నారు.

పుస్తక సంపాదకులు, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ జాతీయ సదస్సులో పాల్గొన్న 31 మంది ఆచార్యులు, పరిశోధక విద్యార్థుల వ్యాసాలను సమగ్రంగా సేకరించి పుస్తక రూపంలో తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని “మూసీ” ప్రత్యేక సంచికగా వెలువరించిన నిర్వాహకులు ఆచార్య సాగి కమలాకర్ శర్మకు, ప్రచురణకు సహకరించిన కూరెళ్ల ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావుతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

కూరెళ్ల విఠలాచార్య సాహిత్యంపై సమాలోచన రామన్నపేట కళాశాలలో పుస్తక సమీక్ష

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News