అక్రమ నిర్మాణాలపై మున్సిపల్, పోలీసుల సంయుక్త చర్యలు
సూర్యాపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ రోడ్డులో వెలిసిన అక్రమ నిర్మాణాలను సోమవారం మున్సిపల్ అధికారులు, పోలీసులు కలిసి తొలగించారు.మున్సిపాలిటీ అధికారులు, ట్రాఫిక్ ఉప పరిశీలకుడు సాయిరాం సమన్వయంతో ఈ తనిఖీలు చేపట్టారు. రహదారిపైకి చొచ్చుకొచ్చిన దుకాణాలు, షెడ్లు తొలగించడంతో రోడ్డుపై రాకపోకలు సులభమయ్యాయి.రహదారిని ఆక్రమించడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇకపై ఇలాంటి ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఉప పరిశీలకుడు సాయిరాం హెచ్చరించారు.ప్రజలు నిబంధనలు పాటిస్తూ రహదారులను స్వేచ్ఛగా ఉపయోగించుకునేలా సహకరించాలని అధికారులు సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి