Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:38 AM

కుమ్మేరలో కుల దురహంకార హత్యకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి.

09-03-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- సిఐటియు జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి,కల్లూరి మల్లేశం

నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతరలో దళిత,రజక కుటుంబ వ్యక్తులను కులం పేరుతో దూషించి,రెండు నెలల పసికూనను కాళ్ళతో తన్ని చంపిన అగ్రవర్ణ పెత్తందారులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రా రెడ్డి, కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేరలో జరిగిన ఘటనపై సిఐటియు రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కుమ్మరెలో జరిగిన మల్లన్న జాతరలో దైవదర్శనానికి వచ్చిన రజక కుటుంబానికి చెందిన గణేష్ మౌనిక దంపతులను ఆ గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి ఆయన అనుచరులు శ్రీనివాసరెడ్డి ఇతరులు అడ్డుకొని ఘర్షణకు దిగి గణేష్ పై దాడి చేసి రెండు నెలల చిన్న పాపను కాళ్లతో తన్ని శిశువుని హత్య చేసిన దుండగులపై నేటికీ హత్యానేరం కేసు నమోదు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రతిగా బాధితులపై కేసు నమోదు చేయడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాపిత పోరాటాల ఫలితంగా కేవలం బిఎన్ఎస్ 194 సెక్షన్ నమోదు చేయడం అంటే హంతకులను కాపాడటమే నన్నారు.

కులదురహంకర హత్యలకు పాల్పడిన వారిని కటినంగా శిక్షించాలని లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు,మాయ కృష్ణ,సిఐటియు పట్టణ కన్వీనర్ గంధమల్ల మాతయ్య,సిఐటియు జిల్లా కమిటి సభ్యులు పోతరాజు జహంగీర్,నాయకులు గడ్డమీది నరసింహ,శ్రవణ్,నాగలక్ష్మి,సుజాత,కె.సంధ్య,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కుమ్మేరలో కుల దురహంకార హత్యకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News