Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:01 AM

కులవ్యవస్థ నిర్మూలనకు జీవితాన్ని అంకితం చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే

11-04-2026 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పూలే 199వ జయంతి సందర్భంగా ఘన నివాళులు – మేకల మల్లిబాబు యాదవ్

కామేపల్లి: కులవ్యవస్థ నిర్మూలనకు, అణగారిన వర్గాల హక్కుల సాధనకు జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని మాజీ జిల్లా పరిషత్ సభ్యుడు, సహకార బ్యాంకు నిర్వాహక మండలి సభ్యుడు మేకల మల్లిబాబు యాదవ్ పేర్కొన్నారు.శనివారం కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచే సామాజిక అసమానతలను గమనించి కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహా యోధుడు పూలే అని అన్నారు. అణగారిన వర్గాలను చదువుకు దూరం చేసి, బానిసలుగా మలిచిన పరిస్థితులను ఎదుర్కొని సమానత్వం కోసం పోరాటం సాగించారని తెలిపారు.

స్త్రీ విద్యకు ప్రాధాన్యం ఇచ్చి తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి పాఠశాలలను స్థాపించి మహిళల అభ్యున్నతికి మార్గం సుగమం చేశారని అన్నారు. అలాగే సత్యశోధక సమాజాన్ని స్థాపించి, రచనల ద్వారా కులవివక్ష నిర్మూలనకు కృషి చేశారని వివరించారు.ప్రస్తుతం పరిస్థితులు మారినప్పటికీ ఇంకా కుల వివక్ష పూర్తిగా తొలగలేదని, పూలే స్ఫూర్తితో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మేకల మల్లికార్జునరావు, ధరావత్ లాలు నాయక్, శీలం పుల్లయ్య, షేక్ అక్బర్, మేకల లక్ష్మీనారాయణ, బాదావత్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కులవ్యవస్థ నిర్మూలనకు జీవితాన్ని అంకితం చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News