Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:39 AM

కృత్రిమ పానీయాలకు గుడ్‌బై.. సహజానికి గ్రీన్ సిగ్నల్..! జిల్లా కలెక్టర్

19-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉగాది పచ్చడి వితరణతో అవగాహన

నల్గొండ: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కృత్రిమ పానీయాలను మానేసి సహజ పానీయాలను సేవించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.

తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటీఎఫ్) నల్లగొండ జిల్లా మరియు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గడియారం సెంటర్ వద్ద నిర్వహించిన ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృత్రిమ పానీయాల వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఉంటాయని, ప్రకృతిలో లభించే సహజ పానీయాలే ఆరోగ్యానికి మేలని సూచించారు.

నల్లగొండ తొలి మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాలానుగుణంగా శరీరానికి అవసరమైన పోషకాలు అందించే సహజ పానీయాలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.

టీఎస్ యుటీఎఫ్ నేతలు మాట్లాడుతూ సమాజంలో కృత్రిమ పానీయాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. యువత శీతల పానీయాల వినియోగాన్ని తగ్గించి కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, చెరుకు రసం వంటి సహజ పానీయాల వైపు మొగ్గుచూపాలని సూచించారు.

డీఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు సామాజిక స్పృహను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Sthanikam

కృత్రిమ పానీయాలకు గుడ్‌బై.. సహజానికి గ్రీన్ సిగ్నల్..! జిల్లా కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News