సూర్యాపేట పట్టణంలోని కృష్ణానగర్ పోలింగ్ కేంద్రం సంఖ్య 49లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన సాధారణ ఓటరుల్లా వరుసలో నిలబడి తన ఓటు వేశారు.ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఓటు వేయడం ప్రతి పౌరుడి హక్కు మాత్రమే కాకుండా బాధ్యత కూడా అని తెలిపారు.
పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. పట్టణంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు సమాచారం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి