Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:50 AM

కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ జహీర్ నామినేషన్

29-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్థానికం ప్రతినిధి

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో 34వ వార్డులో రాజకీయ సందడి నెలకొంది. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ జహీర్ గురువారం తన నామినేషన్ పత్రాలను మున్సిపాలిటీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.ఈ సందర్భంగా షేక్ జహీర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ఇప్పటికే అమలు చేస్తున్నామని గుర్తుచేశారు.నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, త్వరలోనే కొత్త రేషన్ కార్డులు కూడా అందజేస్తామని తెలిపారు. 34వ వార్డు సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ గుర్తైన చేయి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని షేక్ జహీర్‌కు మద్దతు పలికారు.

Sthanikam

కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ జహీర్ నామినేషన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News