Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:03 PM

కొత్త రేషన్ దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానం

12-03-2026 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అర్హులైన స్థానికులు ముందుకు రావాలి

సూర్యాపేట జిల్లాలో ఖాళీగా ఉన్న కొత్త రేషన్ దుకాణాల డీలర్ల నియామకానికి అర్హులైన స్థానికులు దరఖాస్తు చేసుకోవాలని ఆదాయ విభాగాధికారి ఆర్ వేణు మాధవరావు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.జిల్లాలోని తొమ్మిది మండలాల్లో మొత్తం పదిహేను రేషన్ దుకాణాల డీలర్ స్థానాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆత్మకూర్ మండలంలోని గట్టికల్లు, శెట్టిగూడెం గ్రామాలు, చివ్వేంల మండలంలోని చందుపట్ల గ్రామం, వాల్య తండా, జాజిరెడ్డిగూడెం మండలంలోని కొమ్మాల గ్రామం, మోతే మండలంలోని నరసింహపురం, తుమ్మగూడెం గ్రామాలు, నాగారం మండలంలోని వర్ధమానుకోట గ్రామం, నూతనకల్ మండలంలోని ఎడవెల్లి గ్రామం, సూర్యాపేట మండలంలోని ఇమ్మంపేట గ్రామం, సూర్యాపేట పట్టణం, తాళ్లకాంపాడు గ్రామం, తిరుమలగిరి మండలంలోని మాలిపురం, తిరుమలగిరి గ్రామాలు, తుంగతుర్తి మండలంలోని రావులపల్లి గ్రామాల్లో ఈ స్థానాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.ఈ రేషన్ దుకాణాల డీలర్ నియామకాలకు ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణత కలిగి, పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అర్హులైన స్థానికులు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆదాయ విభాగాధికారి తెలిపారు.

Sthanikam

కొత్త రేషన్ దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News